జో బిడెన్‌ను గెలిపించండి : మిషెల్లి ఒబామా

ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కాపాడటానికి, క‌రోనా మ‌హ‌హ్మారి నుంచి ర‌క్షించి దేశాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి జో బిడెన్ కృషిచేస్తార‌ని మాజీ అమెరికా ప్ర‌థ‌మ మ‌హిళ మిషెల్లి ఒబామా అభిప్రాయ‌ప‌డ్డారు. న‌వంబ‌రులో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో జో బిబెన్‌ను అద్య‌క్షుడిగా ఎన్నుకోవాల్సిందిగా కోరారు. డెమొక్రటిక్ క‌న్వెన్ష‌న్ నైట్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మిషెల్లి ఒబామా హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ..త‌న భ‌ర్త బ‌రాక్ ఒబామా అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో జో బిడెన్ ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేశార‌ని, ఆయ‌న ప‌నిత‌నం ఏంటో త‌న‌కు తెలుసునని అన్నారు. స్మార్ట్ ప్రణాళిక‌లు ర‌చించి త‌న జ‌ట్టులోని స‌భ్యుల‌ను ముందుకు న‌డిపిస్తార‌ని, ఎంతో మార్గ‌ద‌ర్శ‌కంగా ప‌నిచేస్తార‌ని కొనియాడారు. ఆర్థ‌క వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు, క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ర‌క్షించి దేశాన్ని ముందుకు తీసుకెళ్ల‌డానికి ఏమి అవ‌స‌ర‌మో బిబెన్‌కు బాగా తెలుస‌న‌ని మిషెల్లి అభిప్రాయ‌ప‌డ్డారు.