జియోపీఓఎస్‌ లైట్‌ యాప్‌తో ఇతర నంబర్లకు రీఛార్జి చేస్తే 4% కమిషన్‌: జియో

సొంత నెట్‌వర్క్‌పై ఏ ఖాతాదారుడి నెంబరును అయిన రీఛార్జి చేసే సౌలభ్యాన్ని రిలయన్స్‌ జియో తీసుకొచ్చింది. జియోపీఓఎస్‌ లైట్‌ యాప్‌ సాయంతో చందాదారులు చేసే రీఛార్జిలపై దాదాపు 4 శాతం కమిషన్‌ పొందొచ్చని జియో తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది వినియోగదారులు రీఛార్జి చేసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జియో తాజా నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి జియోపీఓఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. ఏ వినియోగదారుడికైనా రీఛార్జి చేయొచ్చు. మొదటిసారి వినియోగదారులు రూ.1000 లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆతర్వాత రూ.200 చేసుకుంటే సరిపోతుంది.