జిఎంఆర్‌తో అమెజాన్‌ ఒప్పందం

ప్రముఖ ఇ- కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గురువారం జిఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అమెజాన్‌ తన అతిపెద్ద ఫుల్‌పిల్‌మెంట్‌ సెంటర్‌ (ఎఫ్‌సి)ని విస్తరించనుననట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ గోడాం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీన్ని 1.80 లక్షల చదరపు అడుగులకు పెంచాలని నిర్దేశించుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తన వేర్‌హౌజ్‌ కేంద్రాల సామర్థ్యాన్ని 8.50 లక్షల చదరపు అడుగులకు విస్తరించనున్నట్లు తెలిపింది. అయితే వీటికి ఎంత పెట్టబడి పెట్టేది ఆ సంస్థ వెల్లడించలేదు.