వైసీపీ నేత జగన్ కు పిఠాపురం నుంచి స్వల్ప అస్వస్థత

ప్రతిపక్ష నేత జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సీబీఐ కోర్టు ఆదేశాలతో జగన్ ప్రతి శుక్రవారం కోర్టు హాజరవుతున్నారు. గురువారం పిఠాపురం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. శుక్రవారం కోర్టు వాయిదా ముగించుకుని అదే రోజు రాత్రి పిఠాపురం వెళ్లారు. శనివారం పిఠాపురం మండలంలోని చెందుర్తి క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్ర కొనసాగించారు. ఇప్పటివరకు జగన్ 228 రోజులు పాదయాత్ర చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం పాదయాత్రలో ఉండగా కొంత అస్వస్థతకు గురయ్యారు. ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఆదివారం నుంచి పాదయాత్ర కొనసాగిస్తారా లేక విశ్రాంతి తీసుకుంటారనే అనేది సందిగ్ధంగా మారింది. పాదయాత్ర కొనసాగింపుపై వైసీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.