గోఎయిర్ 2020 నూతన సంవత్సరం ఆఫర్లు

•       ముందుగా బుక్ చేసుకోండి, 2020లో హైదరాబాద్‌ నుంచి మీకు నచ్చిన ప్రదేశాలకు విహరించండి

•       Rs 1620   నుంచి ధరలు ప్రారంభం, ధరల చివరి రెండు అంకెలు “20”తో ముగుస్తాయి

•       బుకింగ్ సమయం 3 – 8 సెప్టెంబర్  2019, ప్రయాణ సమయం 14 జనవరి 2020 to 31 జూలై  2020

సెలవులు గడపటంలో విహార యాత్రలు చేయడం, దానికి తగ్గ ప్రణాళికలు రూపొందించుకోవడం, అవి స్వల్పకాలిక సెలవులు కావచ్చు లేదా కుటుంబంతో కలిసి సరదా ప్రయాణాలు కావచ్చు, లేదా ఎక్స్‌కర్షన్లు కావచ్చు, హైదరాబాదీలు మారుతున్నారు.. మారుతున్న ఈ ధోరణులను భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న విమానయాన సంస్థ గోఎయిర్ అందిపుచ్చుకుంటోంది. 2020 కొత్త దశాబ్దానికి శోభాయమానంగా స్వాగతం పలుకుతోంది. జనవరి 14, 2020 నుంచి 31 జూలై, 2020 వరకు గోఎయిర్‌ నెట్‌ వర్క్ నిర్వహిస్తున్న 24 దేశీయ నగరాల్లో మీకు నచ్చిన చోటుకు వెళ్లండి. వార్షిక సెలవులు అద్భుతంగా గడిపేందుకు సిద్ధమైపోండి. సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 8, 2019 మధ్య కాలంలో మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని బుక్ చేసుకోండి.టికెట్‌ ధరలు Rs 1620  నుంచి ప్రారంభం.

విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలనే బలమైన సందేశాన్ని కస్టమర్లకు అందించేందుకు గోఎయిర్‌ 2020 నుంచి చొరవ తీసుకుంటోంది. వెంటనే మీరు ఫ్లై స్మార్ట్ లో బుక్ చేసుకోండి. 2005 లో గో ఎయిర్‌ ప్రారభించిన నాటి నుంచి మేము ప్రయాణికులను చైతన్యవంతం చేస్తూనే ఉన్నాం, విమాన టికెట్ బుక్ చేసుకునేందుకు మంచి రోజు నేడే అని. ఎందుకంటే రేపటి రోజున ధరలు చౌకగా ఉండకపోవచ్చు. 2020ని సెలబ్రేట్ చేసుకునేందుకు గోఎయిర్ వివిధ మార్గాల్లో ధర చివరి రెండు అంకెలు 20తో ముగిసేలా టికెట్లు అందిస్తోంది. సృజనాత్మకత అన్నది ఒకేసారి జరగదు, వివిధ వ్యక్తులు,సంస్థల సమ్మేళనంతోనే అది సాధ్యమవుతుంది. ఈ 2020లో గోఎయిర్ ఆ పాత్ర పోషించేందుకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా గో ఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ జె వాడియా మాట్లాడుతూ: “విదేశీయుల మాదిరిగానే భారతీయులు కూడా సెలవులకు సంబంధించిన ప్లాన్లను 120-180 రోజులకు ముందు, కొన్ని సందర్భాల్లో 210 రోజులు ముందే చేసుకుంటున్నారు. ముందుగా ప్లాన్ చేసుకుంటే పొందే లాభాలను కస్టమర్లు అర్థం చేసుకోవడం, లాంగ్ పిరీయడ్ కాల్స్ తీసుకోవడం చాలా సంతోషం కలిగిస్తోంది.ఎంచుకునే అవకాశానికి ఉన్న శక్తిని కస్టమర్లు తెలుసుకుంటున్నారు, అది 2-3 స్టార్ హోటల్ ధరకు 4 లేదా 5 స్టార్ కావచ్చు లేదా నచ్చిన రూమ్, ప్రదేశం, ధర ఏదైనా కావచ్చు. అలా ముందుకు వెళ్లండి,మీ సెలవుల అవసరాలకు తగినట్టుగా మీ ఫ్లైట్లు ఎంపిక చేసుకోండి, దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ చూడండి, లక్నోలో స్నేహితులతో కలిసి హోలి సంబరాలు కానీయండి, లేదా కోల్‌కతాలో జరిగే అంతర్జాతీయ బుక్‌ ఫెయిర్‌ సందర్శించి ప్రముఖ రచయితలను కలుసుకోండి. ఆ స్వేచ్ఛ మీకుంది, అంతా మీ ఇష్టం ”