కోడా ను ఆవిష్కరించిన నెక్ట్స్ ఎడ్యుకేషన్

పిల్లలకు సొంతంగా నేర్చుకోవడాన్ని ఓ ఆనందదాయక అనుభూతిగా, అర్థవంతమైన అనుభవంగా మార్చేందుకు తన నిరంతర ప్రయత్నాల్లో భాగంగా భారతదేశ అగ్రగామి విద్యా పరిష్కారాల రూపకర్త అయిన నెక్ట్స్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రై.లి. కోడాను ఆవిష్కరించింది. ఇది బ్లాక్ ఆధారిత ప్రోగ్రామింగ్ అప్రోచ్. మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీన్ని రూపొందించింది. 9 నుంచి 13 ఏళ్ళ లోపు విద్యార్థుల కోసం రూపొందించిన కోడింగ్ గేమ్ ఇది. కంపెనీకి చెందిన స్వీయ అభ్యసన వేదిక అయిన లెర్న్ నెక్ట్స్ పై ఇది లభ్యమవుతుంది. పిల్లలు వినోదాత్మక రీతిలో తమ సొంత గేమ్స్ ను డిజైన్ చేసేందుకు కోడా వీలు కల్పిస్తుంది. తద్వారా కోడ్ రాయడం ఎలానో మరియు వివిధ కార్యకలాపాలు చేయడం ఎలానో వారు నేర్చుకోవడంలో తోడ్పడుతుంది. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మేథ్) లో ప్రావీణ్యం సాధించేందుకు సాయపడుతుంది.

నెక్ట్స్ ఎడ్యుకేషన్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు శ్రీ బియాస్ దేవ్ మాట్లాడుతూ ‘ప్రపంచం వేగంగా నాలెడ్జ్ ఎకానమీగా మారుతున్న నేపథ్యంలో పిల్లలు తప్పనిసరిగా క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, కొలాబ్రేషన్ వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను కలిగి ఉండాల్సి వస్తోంది. వారు భవిష్యత్తులో ఉద్యో గాలు పొందేందుకు వారు అర్హులు కావడంలో ఇవెంతో ముఖ్యమైనవి. సాంకేతికత, గాడ్జెట్స్, గిజ్మోస్ వంటి వాటి కారణంగా చిన్నారులు చిన్న వయస్సుల్లోనే స్టెమ్ రంగాల పై ఆసక్తి కనబరుస్తున్నా, వారిలో చాలా మంది వాటిని ఉపయోగించే దశ నుంచి పెద్దయిన తరువాత ఓ ఇన్నోవేటర్ గా మాత్రం మారలేక పోతు న్నారు. ఒక వేళ అలా మారినప్పటికీ అది ఎంతో మందకొడిగా జరుగుతున్నది. రేపటి తరం కోడర్స్ కు స్ఫూర్తి కలిగించేలా వినూత్న టెక్నిక్స్ ద్వారా కోడా అభివృద్ధి చేయబడింది. తద్వారా వారు మరింతగా నూతన అనుభవాలు పొందేందుకు ఉత్సుకత చూపుతారు”’ అని అన్నారు.