కోవిడ్ -19 కారణంగా లాక్డౌన్ కొనసాగుతున్నది . ఈ నేపథ్యంలో కొమెడ్-కె యుగెట్ , యుని-గేజ్ ప్రవేశ పరీక్ష -2020ను జూన్ మొదటి వారానికి మార్చారు. మే 10వ తేదీ నిర్వహించాల్సిన ఈ పరీక్షను వాయిదా వేశారు. పరీక్ష తేదీలను మే మొదటి వారంలో ప్రకటించనున్నారు . ఈ కన్సోర్టియం ఇప్పుడు అప్లికేషన్లు చేరడానికి తుది గడువును మే 5కు మార్చింది. మాక్ టెస్ట్‌లను విడుదల చేయడం ద్వారా పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సహాయపడుతుంది. ఈ మాక్ పరీక్షలు www.comedk.org ; www.unigauge.com లో సిద్ధంగా ఉన్నాయి. “ప్రవేశ పరీక్షలు రాయడంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, లాక్డౌన్ కారణంగా ఏర్పడిన ఆందోళనను దృష్టిలో పెట్టుకుని కొమెడ్-కె, యుని-గేజ్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సహాయపడేందుకు మాక్ పరీక్షలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఎరా ఫౌండేషన్ సీఈవో మురళీధర్ తెలిపారు. కొమెడ్‌కె యుగెట్ పరీక్షను కర్నాటక ప్రొఫెషనల్ కాలేజీస్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు అనుబంధంగా ఉన్న కాలేజీలలో బీటీ/బీటెక్ అడ్మిషన్ల కోసం నిర్వహిస్తారు. యుని-గేజ్ పరీక్షను భారతదేశ వ్యాప్తంగా సుప్రసిద్ధ డీమ్డ్ /ప్రైవేట్ యూనివర్శిటీలు, ఇనిస్టిట్యూట్లలో బీఈ/బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు నిర్వహిస్తారు.
