కేంద్రం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోంది: నాయిని

Central Govt is wasting labor laws says Naini – Sakshiకార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి, వారి హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాజ్‌బహదూర్‌ గౌర్‌ శతజయంత్యుత్సవాల ప్రారంభానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భూమి, భుక్తి కోసం నైజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి రాజ్‌బహదూర్‌ అని నాయిని అన్నారు. కేంద్ర విధానాలతో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోకుం డా పోతున్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్‌ అంజాన్, తమ్మినేని వీరభద్రం, నవ తెలంగాణ సంపాదకుడు వీరయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *