కాసేపట్లో బిగ్ ఫైట్ న్యూజిలాండ్‌తో భారత్ ఢీ

ప్రపంచకప్‌లో బిగ్‌ఫైట్‌కు బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానం సిద్ధమైంది. బౌలింగ్‌ను చీల్చిచెండాడగల బ్యాట్స్‌మెన్‌తో కూడిన భారత్… భీకరమైన పేస్ బౌలర్లు ఉన్న కివీస్ కాసేప‌ట్లో త‌లపడనున్నాయి. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు నమోదైన పిచ్‌పై తాడోపేడో తేల్చుకోనున్నాయి. భారత్ ఓవైపు బ్యాటింగ్ మెరుపులతో జైత్రయాత్ర కొనసాగిస్తుంటే.. పేస్ బౌలింగ్ బలంతో ఎదురైన జట్లను చిత్తు చేస్తూ కివీస్ విజయాల పరంపర సాగిస్తున్నది.
బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమ్‌ఇండియా ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లను ఓడించి కొండంత విశ్వాసంతో ఉంటే.. శ్రీలంక, ఆఫ్ఘన్, బంగ్లా లాంటి జట్లపై కివీస్ గెలిచింది. గాయం కారణంగా జట్టుకు ధవన్ దూరం కావడం ఎదురుదెబ్బే అయినా రోహిత్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూలాంశం. అలాగే స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భువనేశ్వర్, బుమ్రా చెలరేగితే ఇక టీమ్‌ఇండియాకు తిరుగుండదు. 

అయితే వరుణుడు కరునిస్తాడ లేదా వేచి చూడాలి