కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం భారీ భద్రత

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు రానుండటంతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. నాలుగువేలమంది పోలీసులతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ భద్రత పెంచారు. గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ ఫోర్స్‌ను తెలంగాణ పోలీస్‌శాఖ పంపింది. చత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు వచ్చారన్న సమాచారంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చుట్టూ హై అలర్ట్‌ ప్రకటించారు.