కాళేశ్వరం పనులను రెండోరోజు పర్యవేక్షించిన హరీశ్‌

కాళేశ్వరం పనులను మంత్రి హరీశ్‌రావు రెండోరోజు పర్యవేక్షించారు. ప్యాకేజీ 6 పంప్‌ హౌజ్ పనులను పరిశీలించారు. ఆగస్టు 15కల్లా నీటిని నింపడానికి సర్జ్ పూల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎల్లంపల్లి బ్యారేజీని మంత్రి సందర్శించారు. బ్యారేజీ వద్ద వరద పరిస్థితి, గేట్ల పని తీరును అధికారులను అడిగితెలుసుకున్నారు. అంతేకాకుండా సుందిల్ల బ్యారేజీ పనులను హరీశ్‌రావు పరిశీలించారు.