కర్నూలులో 283 యాక్టివ్‌ కేసులు

జిల్లాలో మరో 13 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 566 కు చేరింది. ఇందులో ఇప్పటి వరకు 267 మంది డిశ్చార్జ్‌ కావడం, 16 మంది మృతి చెందడంతో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 283 (కరోనాతో బాధపడుతున్న వారు) మాత్రమే ఉంది. తాజాగా నమోదైన 13 కేసుల్లో కర్నూలు నగరంలో 11, నంద్యాల, ఆదోనిలో ఒక్కొక్కటి ఉన్నాయి. దీంతో పాటు  కర్నూలులో మరొకరు మృతి చెందారు. ఇప్పటి వరకు జిల్లాలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కర్నూలు నగరంలో 357 మందికి, నంద్యాలలో 112 మందికి కరోనా సోకినట్లయ్యింది.