కరోనాపై పోరుకు రెడ్డీస్‌ ల్యాబ్స్‌ భారీ విరాళం

కరోనా మహమ్మారి నివారణ, సహాయక చర్యల కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ భారీ విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5కోట్లు విరాళం అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి  వి. నారాయణ రెడ్డి సీఎస్‌ను కలిసి చెక్కు అందజేశారు.