కరీంనగర్‌లో కేటగిరీల ఆధారంగా తెరుచుకోనున్న దుకాణాలు

కరీంనగర్‌ మున్సిపల్‌ పరిధిలోని దుకాణాల్లో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నట్లు కమిషనర్‌ క్రాంతి తెలిపారు. దీని కోసం దుకాణాలకు నెంబర్లు వేస్తామని చెప్పారు. ‘‘కేటాయించిన ప్రకారం సరి -బేసి తేదీల్లో దుకాణాలు తెరవాలి. కార్పొరేషన్‌లో మూడు కేటగిరీలుగా దుకాణాలు విభజించాం. కేటగిరీ-ఎలో నిత్యావసరాలు, మద్యం, నిర్మాణ రంగానికి చెందిన దుకాణాలు ఉంటాయి. వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరవొచ్చు. కేటగిరీ -బిలో వస్త్ర, పాదరక్షల దుకాణాలు ఉంటాయి. వీటికి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తారు. ఇక కేటగిరీ – సిలో హోటళ్లు, స్కూల్స్‌, థియేటర్లు, జిమ్ములు ఉంటాయి. వీటిని పూర్తిగా తెరవకూడదు’’ అని కమిషనర్‌ క్రాంతి తెలిపారు.