ఒప్పో నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో బడ్జెట్‌ ధరలో ఓ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. ఏ12గా విడుదలైన ఈ మొబైల్‌ రెండు వేరియంట్లలో లభించనుంది. బేసిక్‌ వేరియంట్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధరను  రూ.9,990గా నిర్ణయించారు. ఇక 4జీబీ ర్యామ్‌ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్‌ రూ.11,490కు లభించనుంది. బ్లూ, బ్లాక్‌ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉండనుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై కొనుగోలు చేసేవారు ఆర్నెల్ల పాటు వడ్డీ రహిత వాయిదాల్లో కొనుగోలు చేసుకోవచ్చు. 

ఒప్పో ఏ12 ప్రత్యేకతలు

* 6.22 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే

* మీడియా టెక్‌ పీ 35

* 3జీబీ+ 32జీబీ, 4జీబీ+ 64జీబీ ర్యామ్‌, ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లలో లభించనుంది.

* వెనుక వైపు 13+2 మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరా * ముందువైపు 5 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

* కలర్‌ ఓఎస్‌ 6.1 ఆండ్రాయిడ్‌ 9 పై. 

* 4,230ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం