ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, జీఎస్టీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, జీఎస్టీ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆగస్ట్ 21, 22 తేదీల్లో ‘బిగ్ ఫైలింగ్ డేస్’ ప్రారంభించింది క్లియర్‌ట్యాక్స్. ఈ రెండు రోజుల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ట్యాక్స్‌పేయర్స్‌కు ఆఫర్లు ప్రకటించింది. క్లియర్‌ట్యాక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐటీ రిటర్స్ ఫైల్ చేయడం ఉచితమే. అయితే ‘బిగ్ ఫైలింగ్ డేస్’లో భాగంగా ఆగస్ట్ 21, 22 తేదీల్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే కొన్ని బహుమతులు గెలుచుకునే అవకాశముంది. ప్రతీ నిమిషానికి ఓ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్, ప్రతీ గంటకు ఓ గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్, ప్రతీ రోజు థాయ్‌ల్యాండ్ ట్రిప్ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది క్లియర్‌ట్యాక్స్. ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే. ఇవి కాకుండా క్లియర్ట్యాక్స్లో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ప్రతీ ఒక్కరికీ రూ.10,000 విలువైన రివార్డ్స్ అందిస్తోంది. ఈ రివార్డులను ఆగస్ట్ 31 వరకు పొందొచ్చు. ClearTax.in వెబ్సైట్ లేదా, క్లియర్‌ట్యాక్స్ ఇ-ఫైలింగ్ యాప్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. క్లియర్‌ట్యాక్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 40 లక్షల మంది ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు.
