ఏపీ డిప్యూటీ సీఎం సంచలన

Deputy CM KE Krishnamurthy Fires On BJP – Sakshiరానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక్క సీటు గెలిచినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవాస్తవాలు ప్రస్తావించారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూ టర్న్‌ తీసుకున్నారు అని ప్రధాని అనడం అన్యాయమన్నారు. అవాస్తవ హామీలతో ఏపీ ప్రజల్ని మోసగించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూ టర్న్‌ తీసుకున్నది మోదీయేనని విమర్శించారు. రాష్ట్రానికి హోదా తీసుకురావడానికి ఎంత దూరమైనా వెళతామని, ధర్మ పోరాటం విరమించే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు