ఏపీలో షాపులు ఓపెన్‌!

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రాల మధ్య రాకపోకలపై అనుసరించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌  ఆదివారం తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.