ఏపీలో మరో 180 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 8,066 మంది నమూనాలు పరీక్షించగా 180 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 101 ఉండగా.. రాష్ట్రంలో 79 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,971 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 68కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,244కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 967 మంది చికిత్స పొందుతున్నారు.