రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం లాక్డౌన్ 4.0కు సంబంధించి మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించాలనుకునేవారు కార్లలో అయితే గరిష్ఠంగా ముగ్గురికి మాత్రమే అనుమతించనున్నారు. దుకాణాల వద్ద ఐదుగురికి మాత్రమే అనుమతివ్వాలని, అక్కడ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.
