ఏపీలో కొత్తగా 154 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు అనంతరం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 154 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4813కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులు 28 ఉండగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించి ఒక్క కేసు ఉంది. తాజాగా 34 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2387కి చేరింది. ఇప్పటి వరకూ 75 మంది ప్రాణాలు కోల్పోయారు.