ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లాభం రూ.412 కోట్లు

గత ఆర్థిక సంవత్సరంలో (2019-20) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ రూ.412 కోట్ల నికర లాభాన్ని, రూ.564 కోట్ల పన్ను ముందు లాభాన్ని (పీబీటీ) ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో (2018-19) రూ.470 కోట్ల పన్ను ముందు లాభాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, కంపెనీ అండర్‌రైటింగ్‌ లాభం రూ.79 కోట్ల నుంచి 61 కోట్లకు తగ్గింది. స్థూల రిటర్న్‌ ప్రీమియం (జీడబ్ల్యూపీ) 2018-19 నాటి రూ.4,717 కోట్ల నుంచి రూ.6,840 కోట్లకు పెరిగింది. సాల్వెన్సీ నిష్పత్తి 2.34 శాతం నుంచి 2.27 శాతానికి తగ్గింది.