భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) జీవన్ అమర్ పేరిట కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ విడుదల చేసింది. ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉండే పాలసీ కాదు. పాలసీదారుడు ఏదైనా దురదృష్టకర సంఘటన కారణంగా మరణించినప్పుడు అతని కుటుంబానికి మాత్రమే రక్షణ కల్పించే నాన్ లింక్డ్ పాలసీ ఇది. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న పలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు 60 సంవత్సరాలు పైబడిన వారికి అందుబాటులో ఉండవు. కానీ గరిష్ఠంగా 65 సంవత్సరాల వయసు (ముగింపు) వరకు కూడా ఈ ప్లాన్లో చేరే ఆస్కారం ఉంది. అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా దీనికి వర్తిస్తాయి.
