ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు

రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వడంతో తొలిరోజు ప్రజల నుంచి చక్కటి ఆదరణ లభించింది. ఈ రోజు ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 9 గంటల వరకు 9,486 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖాతాలో రూ.96 లక్షలు జమ అయ్యాయి. దరఖాస్తుల్లో గ్రామ పంచాయతీల నుంచి 2,946 రాగా, కార్పొరేషన్ల నుంచి 2,316, మున్సిపాలిటీల నుంచి 4,224 వచ్చాయి. అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం వెబ్‌సైట్‌, యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులను తీసుకుంటోంది.