ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై కేసు

విశాఖ: విశాఖలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గోపాలపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద ఆ సంస్థపై కేసులు నమోదు చేశారు. సెక్షన్‌ 337, 338, 304 కింద కేసులు నమోదు చేసినట్లు గోపాలపట్నం పోలీసులు తెలిపారు.