ఎంజీ మోటార్స్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మరో కారును మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లోకి ఎంజీ హెక్టార్ కారును విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. నాలుగు వేరియంట్లలో ఎంజీ హెక్టార్ కారును రూపొందించారు. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ. 12.18 లక్షలతో మొదలవుతుంది. మార్కెట్లో ఎంజీ హెక్టార్ ఎస్యూవీ కారు రూ. 16.88 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఎంజీ హెక్టార్ ఎస్యూవీ కారు నాలుగు వేరియంట్లు స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్లో అందుబాటులో ఉంటుంది.
