ఈ ఏడాది 40 వేల ఉద్యోగాలను కేవలం ఫ్రెషర్లకే: టీసీఎస్‌

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది తమ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని పేర్కొంది. అదే సమయంలో ఉద్యోగులకు ఈ ఏడాది ఎలాంటి వేతనాల పెంపూ ఉండబోదని స్పష్టం చేసింది. ఈ ఏడాది 40 వేల ఉద్యోగాలను కేవలం ఫ్రెషర్లకే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. ప్రస్తుతం కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ అనంతరం పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత ఉండబోతోందన్న వార్తల నేపథ్యంలో టీసీఎస్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

EENADU Logo

homeశుక్రవారం, ఏప్రిల్ 17, 2020☰

తాజా వార్తలు

40 వేల ఉద్యోగాలు ఫ్రెషర్లకే: టీసీఎస్‌

40 వేల ఉద్యోగాలు ఫ్రెషర్లకే: టీసీఎస్‌

ముంబయి: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది తమ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని పేర్కొంది. అదే సమయంలో ఉద్యోగులకు ఈ ఏడాది ఎలాంటి వేతనాల పెంపూ ఉండబోదని స్పష్టం చేసింది. ఈ ఏడాది 40 వేల ఉద్యోగాలను కేవలం ఫ్రెషర్లకే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. ప్రస్తుతం కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ అనంతరం పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత ఉండబోతోందన్న వార్తల నేపథ్యంలో టీసీఎస్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో సంస్థ లాభాలు నమోదు చేసిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాల్లో మాత్రం పరిస్థితులు అంత అనుకూలంగా ఉండబోవని త్రైమాసిక ఫలితాల వెల్లడి సమయంలో కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న 4.5 లక్షల మందిలో ఏ ఒక్కరినీ తొలగించబోమని టీసీఎస్‌ ఎండీ, సీఈవో రాజేశ్‌ గోపీనాథ్‌ పేర్కొన్నారు. ఈసారి 40 వేల మంది ఉద్యోగాలను ఫ్రెషర్లకే ఇవ్వాలని నిర్ణయించామని టీసీఎస్‌ మానవ వనరుల విభాగాధిపతి మిలింద్‌ లక్కడ్‌ పేర్కొన్నారు. జూన్‌తో కళాశాలలు, యూనివర్సిటీలు ముగుస్తాయయని, అనంతరం వారు చేరుతారని తెలిపారు. అదే సమయంలో ఈ ఏడాది ఉద్యోగులెవరీకి వేతనాల పెంపు ఉండబోదని స్పష్టంచేశారు.