ఇండియామార్ట్‌ ఐపీఓ

బీ2బీ ఈ-కామర్స్‌ సంస్థ ఇండియామార్ట్‌ తన తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)ను సోమవారం ప్రారంభించింది. ఇందులో ప్రైస్‌బ్యాండ్‌ను రూ. 970-973గా నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా కంపెనీ 48,87,862 ఈక్విటీ షేర్లను రూ.10 ముఖ విలువతో జారీ చేస్తోంది. ప్రైస్‌బ్యాండ్‌ కనీస ధర ముఖ విలువ కన్నా 97 రెట్లు, గరిష్ఠ ధర 97.3 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.474 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటోంది. కంపెనీలో వాటాదారులుగా ఉన్న ఇంటెల్‌ క్యాపిటల్‌, అమడస్‌, డీపీఎఫ్‌ లిమిటెడ్‌లతోపాటు ప్రమోటర్‌ దినేష్‌ చంద్ర అగర్వాల్‌ తమ వాటాలో కొంత భాగాన్ని విక్రయిస్తున్నారు.