ఆరోగ్య సేతు: సమాచారం భద్రం..

దిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌ వాడకం వల్ల ఏవిధమైన సమాచార ఉల్లంఘన జరగడం లేదని బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.  90 మిలియన్ల భారతీయుల గోప్యత ప్రమాదంలో ఉందంటూ ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్‌ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పష్టతనిచ్చింది. ‘ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన సమాచారం కూడా ప్రమాదంలో ఉందని ఈ ఎథికల్ హ్యాకర్‌ నిరూపించలేకపోయారు’ అని ప్రభుత్వం వెల్లడించింది.