దేశవ్యాప్తంగా విస్తరణ కోసం సిద్ధమైన ఆయె ఫైనాన్స్

18 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో తన ముద్రను పెంపొందించడానికి 67 కొత్త బ్రాంచిలను తెరుస్తోంది

ఆయె ఫైనాన్స్, క్యాపిటల్ జి సహకారం కలిగిన ఫిన్ టెక్ ఋణదాత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశమంతటా విస్తరించడం కోసం తన ప్రణాళికను ప్రకటించింది. అత్యంత సఫలీకృత సంవత్సరం తరువాత, అంటే, ఈ సంవత్సరంలో ఆయె, ఒక ఎయుఎమ్ (AUM) (ప్రారంభక) గణాంకాలైన రూ. 1000 లను సాధించిన ఈ ఫిన్‌టెక్ ఋణదాత, మరిన్ని భారతీయ సూక్ష్మ ఎంటర్ ప్రైజెస్ ఋణావసారాల కోసం సేవలను అందించుటకు 67 కొత్త శాఖలను ప్రారంభించబోతోంది.  

ఆయె, తన ముద్రలను త్వరితంగా విస్తారిస్తోంది మరియు ఈ ఆవృత్తంలో భాగంగా, ఆయె, మహరాష్ట్ర, గుజరాత్, బీహార్, జార్ఘండ్, ఛత్తీస్ ఘడ్, చండీగఢ్ మరియు హిమాచల్ ప్రదేశ్ యొక్క కొత్త రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలలోనే కాకుండా తమిళనాడు, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు కర్నాటక రాష్ట్రాలలో కూడా తన శాఖా ఉనికిని బలోపేతం చేస్తుకుంటోంది. ఈ విస్తరణ అనంతరం, 18 భారతీయ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ఆయె శాఖల సంఖ్య 171 కి చేరుకుంటుంది.

సంజయ్ శర్మ మరియు విక్రమ్ జెట్లీ, ఈ ఆయె ఫైనాన్స్ ను 2014 లో ప్రారంభించారు. వీరు భారతదేశంలోని సూక్ష్మ పరిశ్రమలకు ఋణాలను చవకగా అందించడం ద్వారా వాటికి సాధికారికత కల్పించారు మరియు అప్పటినుండి, ఈ, ఎంఎస్‌ఎంఇ లీడర్, సాంప్రదాయక ఆర్థికతలోనికి 125 వేల మూల వ్యాపారాలను తీసుకువచ్చింది. మరియు ఈ అదనపు 67 శాఖల ద్వారా, ఆయె, అలాంటి వ్యాపారాలు ఎక్కువగా అభివృద్ధి చెందునట్లు సహకారం అందిస్తుంది మరియు నవతరం భారతదేశంలో వారి అభివృద్ధికి శక్తిని అందిస్తుంది..

శ్రీ సంజయ్ శర్మ, ఎండి మరియు ఫౌండర్, ఆయె ఫైనాన్స్, ఇలా అన్నారు, ఆయన ఈ కొత్త శాఖల అంచనాల గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారని, “ఆయె లో మేము ఒక నిర్మాణాత్మక పరిశ్రమ – క్లస్టర్ – ఎంటర్‌ప్రైజ్ పద్ధతిని అనుసరిస్తాము మరియు దృఢమైన రిస్క్ ఎంపిక కోసం ఒక్కొక్క పరిశ్రమ క్లస్టర్ యొక ఆలోచనలను వినియోగించుకుంటాము. దీని తరువాత, 70 పారిశ్రామిక క్లస్టర్స్ లోని 1,25,000 కంటే ఎక్కువ వినియోగదారుల ఋణాలకు సర్వీస్ అందించుట ద్వారా సేకరించబడిన సమాచారాన్ని విశ్లేషిస్తాము. ఈ అదనపు 67 బ్రాంచిలు తెరవడం ద్వారా, మరియు ఇందులోని 30 బ్రాంచిలు ఇదివరకే కార్యకలాపాలు నిర్వహించడం వలన, మేము సేవలు అందించే క్లస్టర్స్ సంఖ్య, నిధులు సమకూర్చిన సూక్ష్మ ఎంటర్‌ప్రైజెస్ తో సహా గణనీయంగా పెరుగుతాయి”