ఆన్ లైన్ బస్ బుకింగ్ యాప్ ట్రావెల్ యారి ఇప్పుడిక పిడబ్ల్యుఎ యాప్

ట్రావెల్ యారి ఇప్పుడు పిడబ్ల్యుఎ (ప్రోగ్రెసివ్ వెబ్ యాప్). ప్రయాణికులకు ఇబ్బందిరహిత బస్ బుకింగ్ అనుభూతిని ఇది అందిస్తుంది. కస్టమర్లు దీన్ని తమ ఫోన్లలోకి డౌన్ లోడ్ చేసుకోకుండానే యాప్ యొక్క అన్ని ఫీచర్లను ఇంటిగ్రేటెడ్ విధానంలో ఉపయోగించుకోవచ్చు. పిడబ్ల్యుఎ వెర్షన్ లోడింగ్ స్పీడ్ ను మెరుగుపర్చడమే గాకుండా మొబైల్ స్టోరేజ్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. కేవలం 311 కెబి గా ట్రావెల్ యారి లైట్ వెర్షన్ అనేది నెమ్మదిగా పని చేసే నెట్ వర్క్ లలో లేదా మెమరీ తక్కువగా ఉండే లేదా భారీ మరియు అధునాతన యాప్స్ ను లోడ్ చేసేందుకు అవసరమైన బ్యాటరీ సపోర్ట్ లేని తగ్గు స్థాయి స్మార్ట్ ఫోన్ల కు ఎంతగానో ఉపయోగపడే ఉపకరణంగా ఉంటుంది. ట్రావెల్ యారి యొక్క పిడబ్ల్యుఎ వెర్షన్ గతంలోమాదిరి యూజర్ అనుభూతిని అందించడాన్ని కొనసాగించనుంది, కాకపోతే మరింత వేగంగా మరియు అప్ డేటెడ్ ఫీచర్లతో ఆ అనుభూతిని అందించనుంది. మొబైల్ యాప్స్ నుంచి రేపటి తరం ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్స్ కు మారిపోయే సమయం ఇది.