True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?….. 

Contact Us : [email protected], Call : 9849851841 

ఇన్కమ్టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ కోసం క్లియర్ టాక్స్ మరియు హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ భాగస్వామ్యం

హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వేదికపై పరిష్కారం అందించనున్న క్లియర్ టాక్స్

ఆదాయ పన్ను ఫైలింగ్ కు సొల్యూషన్స్ అందించే బెంగళూరు కు చెందిన ఫైనాన్షియల్ –టెక్నాలజీ వేదిక అయిన క్లియర్ టాక్స్ సంస్థ హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ తో తన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళింది. భారతదేశ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ 2018 -19 ఆర్థికసంవత్సరానికి  (అసెస్మెంట్ ఇయర్ 2019-20) గాను ఉచిత ఇ-ఫైలింగ్ మరియు వ్యక్తిగతీకరించబడిన సిఎ-అసిస్టెడ్ టాక్స్ ఫైలింగ్ ప్లాన్స్ ను 50 లక్షల మంది హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ ఖాతాదారులకు అందించనుంది.

హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ వేదికపై లభ్యమయ్యే క్లియర్ టాక్స్ సొల్యూషన్ అనేది ఖాతాదారులకు ఇ-ఫైలింగ్ రిటర్న్స్ సమస్యలను పరిష్కరించనుంది. భద్రతతో కూడిన క్లియర్ టాక్స్ ప్లాట్ ఫామ్ ఉచిత సెల్ఫ్ ఇ-ఫైలింగ్ ను అందించనుంది. ఇది 7 నిమిషాల్లో పూర్తవుతుంది. సహాయంతో కూడిన ఫైలింగ్ కావాల్సిన వారు ఏ విధమైన సంక్లిష్టతలకు సంబంధించి అయినా తగ్గింపు రేట్లకు చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు పొందవచ్చు.

అదనంగా క్లియర్ టాక్స్ ఇతర సేవలను కూడా అందిస్తోంది. రోజంతా కస్టమర్ సపోర్ట్, టాక్స్ టూల్స్ మరియు కాలిక్యులేటర్స్ కు యాక్సెస్, సమగ్ర టాక్స్ గైడ్స్ మరియు  ఆన్ సైట్ హెల్ప్ డెస్క్ లాంటివి వీటిలో ఉంటాయి.

క్లియర్ టాక్స్ వ్యక్తిగతీకరణలో అత్యధిక స్థాయిలను, 100 % కచ్చితత్వాన్ని మరియు పారదర్శకతను అందిస్తుంది. పేపర్ వర్క్ ఏదీ ఉండదు మరియు భవిష్యత్ సన్నద్ధతతో ఉంటుంది. ఐటీఆర్ ఫైలింగ్ కు గాను యూజర్లు తమ ఫామ్ 16 మరియు ఫామ్ 26 ఎఎస్ ను అప్ లోడ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో యూజర్ గనుక ఒకటికి మించిన సంస్థల్లో పని చేసి ఉంటే, ఒకటికి మించిన ఫామ్ -16 లను అప్ లోడ్ చేయవచ్చు. ఆఫ్ లైన్ లో ఉన్నప్పటికీ, పన్ను వివరాలను నమోదు చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. యూజర్ ఆన్ లైన్ వెళ్ళగానే ఆ వివరాలు క్లియర్ టాక్స్ సర్వర్ తో ఆటోమేటిక్ గా మిళితమవు తాయి. ఐటీఆర్ ఫైలింగ్ తో పాటుగా యూజర్లు తమ పాన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాల ద్వారా ఆదాయ పన్ను రిఫండ్ స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుత మరియు రాబోయే ఆర్థిక సంవత్సరపు (నూతన బడ్జెట్ మా ర్పులకు అనుగుణంగా) ఆదాయ పన్నును లెక్కించుకోవచ్చు. హెచ్ ఆర్ఎ ప్రయోజనాలను పొందేందుకు రెంట్ రిసిప్ట్ లను జనరేట్ చేసుకోవచ్చు.