ఆంధ్రా బ్యాంక్‌ రూ.2 వేల కోట్ల సమీకరణకు ఆమోదం తెలిపిన బోర్డు

ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంక్‌ రూ.2,000 కోట్లు సమీకరించనుంది. సోమవారం నాడు సమావేశమైన ఆంధ్రా బ్యాంక్‌ బోర్డు రూ.2,000 కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలిపింది. క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ లేదా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ లేదా కీలకేతర ఆస్తుల విక్ర యం లేదా ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల ద్వారా ఈ మొత్తాలను సమీకరించేందుకు బోర్డు అనుమతినిచ్చింది. మార్కెట్‌ పరిస్థితులు, అవసరమైన అనుమతులకు లోబడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ మొత్తాలను సమీకరించనున్నట్లు ఆంధ్రా బ్యాంక్‌ తెలిపింది.