అమిత్ షా, అసదుద్దీన్ల మధ్య రహస్య ఒప్పందం

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో ఎంపి అసదుద్ధీన్‌ ఓవైసి రహస్య ఒప్పందం చేసుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు మతం అంటగట్టడం అసదుద్దీన్‌కే చెల్లుతుందని విమర్శించారు. ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడడం తప్ప..ముస్లింలకు చేసిందేమీలేదని విమర్శించారు. బిజెపిని గెలిపించడానికి వేరే రాష్ట్రాలకు పోయి అభ్యర్ధులను పెట్టి బిజెపిని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అసదుద్దీన్‌కు నిజంగా ముస్లింలపై ప్రేమ ఉందా? అని విహెచ్‌ ప్రశ్నించారు. ముస్లింలను ఎంతవరకు అభివృద్ది చేసింది చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీ అయినప్పటికీ అమిత్‌ షా, అసదుద్దీన్‌ ఇద్దరూ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని దాగుడుమూతలు ఆడుతున్నారని హనుమంతరావు విమర్శించారు.