60,000 లావాదేవీలను నమోదు చేసుకున్న ఎక్స్ పే.లైఫ్ (Xpay.Life)

వినియోగదారులకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎన్‌పిసిఐ చే ఆమోదించబడిన బహుళ-వినియోగ బిల్లు చెల్లింపు వేదిక అయిన ఎక్స్ పే.లైఫ్ , మే నెలలో ఆదాయంలో 142% వృద్ధితో 60,000 కన్నా ఎక్కువ లావాదేవీలతో 3 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించింది. బ్లాక్‌చెయిన్ ఆధారిత లావాదేవీల ఫ్రేమ్‌వర్క్‌తో నడిచే సంస్థ, ఈ లావాదేవీల్లో ఎక్కువ భాగం విద్యుత్ బిల్లుల చెల్లింపుల గురించే జరిగిందని గుర్తించారు. ఇతర విభాగాలలో, మొబైల్ వ్యాన్ల నుండి 23 లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఎక్స్ పే.లైఫ్ మోహరించిన వ్యాన్లు ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం నగదు పంపిణీ చేయడానికి జార్ఖండ్‌లోని రాంచీ, రామ్‌ఘడ్ మరియు హజారిబాగ్ వంటి మారుమూల ప్రాంతాలలో ప్రయాణించాయి. ఈ వ్యాన్ల ద్వారా ప్రతి రోజు సగటున 50-60 లావాదేవీలు జరిగాయి. టైర్- I మరియు టైర్- II నగరాల్లో 253 ఎక్స్ పే బిల్లర్లతో, 50000+ పిన్ కోడ్‌ల విస్తృత స్థాయి కలిగిన టైర్ -3 మరియు టైర్- IV నగరాల్లో కూడా కంపెనీ బలమైన ఉనికిని కలిగి ఉంది.

తన వివేకవంతమైన ఆలోచనలను పంచుకుంటూ, ఎక్స్ పే.లైఫ్ వ్యవస్థాపకుడు మరియు సిఇఓ రోహిత్ కుమార్ మాట్లాడుతూ, ఇలా అన్నారు, “ఈ అపూర్వమైన కాలంలో, వేగంగా అభివృద్ధి చెందుతున్న బిల్లు చెల్లింపు వేదికలలో ఒకటిగా భారతదేశంలోని వినియోగదారులకు వన్-స్టాప్ పరిష్కారాన్ని అందించడం ద్వారా జీవితాన్ని సరళంగా మార్చడమే మా లక్ష్యం. డిజిటల్ చెల్లింపుల యొక్క ప్రయోజనాలను దేశంలోని బ్యాంకు సేవలను ఉపయోగించుకోని వారికి అందించడానికి మరియు ఆర్థిక చేరిక యొక్క మా లక్ష్యాన్ని మరింత పెంచుకోవడానికి మేము ఎన్‌పిసిఐతో భాగస్వామ్యం చేసుకున్నాము.”