కార్పొరేట్ కెఫెటేరియాల సురక్షితమైన కార్యకలాపాల కోసం హంగర్‌బాక్స్ ‘కోవిడ్-19 సేఫ్ పరిష్కారం

భారతదేశపు అతిపెద్ద వ్యాపార సంస్థలు ఇటీవలి వారాల్లో, వారు అనుసరించిన డబ్ల్యుఎఫ్‌హెచ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) మోడల్ నుండి క్రమంగా పునఃస్థితికి రావడానికి సిద్ధమవుతున్నప్పుడు, సిబ్బంది వినియోగించడానికి, కెఫెటేరియాల లను తిరిగి తెరవడం, సామాజిక దూరం పాటించడం మరియు మెరుగైన తాజా నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉండడం ఎఫ్ అండ్ బి కార్యకలాపాల సంపూర్ణ వేల్యూ చైన్ అంతటా భద్రత మరియు పరిశుభ్రత పాటించడం అనేది ఒక కీలకమైన ప్రాధాన్యతగా కలిగింది.

భారతదేశపు ప్రముఖ సంస్థాగత ఫుడ్-టెక్ సంస్థ అయిన హంగర్‌బాక్స్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ (ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ఆధారంగా ఒక శక్తివంతమైన పరిష్కారాన్ని ఆవిష్కరించింది మరియు కెఫెటేరియాల కార్యకలాపాలను ‘కోవిడ్-19 సురక్షితంగా’ చేయడానికి భారత ప్రభుత్వం వారి ఆరోగ్య సేతు యాప్ ను ఉపయోగిస్తుంది.

హంగర్‌బాక్స్ సిఇఓ మరియు సహ వ్యవస్థాపకుడు, సందీపన్ మిత్రా మాట్లాడుతూ, “హంగర్‌బాక్స్ ‘కోవిడ్-19 సేఫ్’ అనే పరిష్కారం సాంకేతిక పరిజ్ఞానం, వినియోగదారు అనుసంధానితం మరియు కమ్యూనికేషన్, ఐదంచల అంశాల విధానాన్ని పాటిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పర్యవేక్షణా శిక్షణ మరియు వంటగది కొరకు మెరుగైన నియమాల వంటివి ఇందులో, నిర్వహణా సిబ్బందిపై నిశితమైన తనిఖీలు మరియు కెఫెటేరియాల కార్యకలాపాల యొక్క 360 డిగ్రీల వీక్షణను కలిగి ఉన్న టెక్-నేతృత్వంలోని పర్యవేక్షణ వ్యవస్థతో సహా కెఫెటేరియాల కార్యకలాపాలు ఉంటాయి.” అని అన్నారు

“కెఫెలు రోజంతా వినియోగదారుల స్థిరమైన ప్రవాహాన్ని స్వీకరిస్తుండగా, సంస్థాగత నేపధ్యంలో కెఫెటేరియాలలు మధ్యాహ్నం 1:17 గంటలకు గరిష్ట రద్దీని కలిగి ఉంటాయని డేటా చూపిస్తోంది. రద్దీతో పాటు, నగదు లావాదేవీల వలన కూడా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కెఫెలలో రద్దీని తగ్గించడాని ఈ పరిష్కారాన్ని సైతం ఏర్పాటు చేయడానికి, నష్టాలను తగ్గించడానికి మరియు ఆహార కాలుష్యం మరియు కోవిడ్-19 సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ వారి తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా మెరుగైన భద్రతా చర్యలు మరియు కార్యాచరణ విధానాలను అమలు చేయడానికి మేము మా ఖాతాదారులతో కలిసి పనిచేశాము, ”అని మిత్రా చెప్పారు.

హంగర్‌బాక్స్ వేదిక, ఎఐ/ఎంఐను ఉపయోగించి, కెఫెటేరియాలలలోకి వినియోగదారుల రాకను నియంత్రిస్తుంది మరియు రద్దీ లేకుండా చేసి మరియు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా మెరుగ్గా నిర్వహించడానికి వీలుకల్పిస్తుంది. వినియోగదారులు కెఫె సురక్షితంగా ఉన్నప్పుడు మరియు సామాజిక దూరం నిర్వహించబడునప్పుడు మాత్రమే వినియోగదారులు సందర్శించునట్లుగా చూసుకుంటుంది. హంగర్‌బాక్స్ వంటగది లోపల మరియు కెఫెటేరియాలలలో మెరుగైన భద్రతా నిబంధనలను కూడా అమలు చేస్తుంది. ‘పని చేయడానికి తగినవారు’ మరియు ఆహారాన్ని నిర్వహించేవారు మాత్రమే కెఫె ఎక్స్‌పీరియన్స్ మేనేజర్స్ గా పనిచేయడానికి అనుమతించబడతారు. సిబ్బంది ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా పరీక్షించడం మరియు వంటగది, ఆహార కౌంటర్లు మరియు కెఫెటేరియాల వద్ద ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండునట్లుగా పర్యవేక్షించడం అనే అంశాలను, హంగర్‌బాక్స్ టెక్ సహాయంతో అమలు చేయబడుతుంది. వీటితో పాటు, నగదు నిర్వహణ వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తొలగించడానికి అన్ని ప్రముఖ కాంటాక్ట్‌లెస్ చెల్లింపు ఎంపికలు అందించబడతాయి.

ఇందుకు గల పరిష్కారంలో భాగంగా, నిర్దేశించబడినన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ప్రమాణాల ఆధారంగా వంటగది పనులు, ముడి పదార్థాల నిర్వహణ, ఆహార తయారీ, వంటగది పరిశుభ్రత ప్రమాణాలు మరియు ఆహార రవాణాను, హంగర్‌బాక్స్ భాగస్వామి వంటశాలలలో 11 వేర్వేరు రికార్డులతో నిర్వహిస్తున్నాయి. వీటిలో పరిశుభ్రత, వంట ఉష్ణోగ్రత, ప్రాంగణాల చెక్‌లిస్టులు, రవాణా మొదలైన వాటి కోసం అనేక లాగ్‌లు ఉన్నాయి. ఆహారం ఖాతాదారుల కెఫెటేరియాలకు చేరుకున్న తర్వాత, ఆహార సేవ & ఆర్డరింగ్, కౌంటర్ పరిశుభ్రత, కెఫె పరిశుభ్రత మరియు కెఫె పర్యవేక్షణ వంటి విభాగాలలో కఠినమైన ప్రమాణాలపై దృష్టి సారించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *