యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డులో మహంకాళి బోనాలు

సికింద్రాబాద్: యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డులో మహంకాళి బోనాలకు చోటుదక్కింది. ఈ నెల 29న జరిగిన బోనాల వేడుకకు యూనివర్సల్ బుల్ ఆఫ్ రికార్డువారు సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో పాటు 1008 బోనాలు సమర్పించిన విషయం తెలిసిందే. ఒకేసారి అధిక సంఖ్యలో బోనాల సమర్పణకుగాను రికార్డ్ దక్కింది. ఈ మేరకు యూనివర్సల్ బుల్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు మంత్రి తలసానికి సర్టిఫికెట్‌ను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *