రూ.595 ప్లాన్‌ను లాంచ్ చేసిన ఐడియా

www.ntnews.com/updates/latestnews/2018/idea-cellular.jpgటెలికాం సంస్థ ఐడియా సెల్యులార్ రూ.595 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే ఐడియా కస్టమర్లకు 10 జీబీ ఫిక్స్‌డ్ మొబైల్ డేటా వస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 112 రోజులుగా నిర్ణయించారు. కాగా ఈ ప్లాన్‌లో కస్టమర్లు గరిష్టంగా రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రెండు తెలుగురాష్ర్టాలతోపాటు అస్సాం, బీహార్, హర్యానా, నార్త్ ఈస్ట్, రాజస్థాన్, యూపీ ఈస్ట్ సర్కిల్స్‌లోని కస్టమర్లకు అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *