మళ్లీ తెరపై కనిపించబోతున్న రేణు దేశాయ్

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రి’, ‘జాని’ సినిమాతో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాన్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొంత కాలం తర్వాత వీరిమద్య అభిప్రాయ భేదాలు రావడంతో చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. అప్పటికే పవన్ – రేణు దేశాయ్ కి ఇద్దరు పిల్లలు పుట్టారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలతో పూణే వెళ్లి పోయింది. పవన్ నుంచి విడిపోయిన రేణు దేశాయ్ .. ఆ తరువాత పిల్లల ఆలనా పాలనపైనే దృష్టి పెట్టారు. వీలును బట్టి మరాఠీ సినిమాలకి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
అంతే కాదు ఈ మద్య ఆమె బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మద్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించిన రేణు దేశాయ్ ప్రస్తుతం తన దృష్టి తన పిల్లలపైనే ఉందని వారి చదువులు పూర్తయ్యే వరకు సినిమాల్లో నటించకూడదని అనుకున్నట్లు తెలిపింది. కానీ ఇప్పుడు రేణు దేశాయ్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. తెలుగులో సినిమాలు చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నట్టు, అయితే మంచి పాత్రల కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. రేణు రెండో పెళ్లి ఇష్యూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారిన సంగతి తెలిసిందే.
ఇక ఇటీవలే ఆమెకి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు కూడా. త్వరలోనే ఆమె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే .. వివాహం తరువాత రేణుదేశాయ్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాన్ రాజకీయాలపై దృష్టి పెట్టారు..ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *