గజ్వేల్ నుంచి హరిత హారం ప్రారంభించనున్న సి.ఎం.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1న గజ్వేల్ పట్టణంలో లక్షా 116 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వీటికి అదనంగా అదే రోజు అటవీభూముల్లో మరో 20వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, సాధారణ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో లక్షా 116 మొక్కలు నాటాలని చెప్పారు. అన్ని రకాల రోడ్ల వెంట, ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల ఆవరణలో, గుడి, మసీదు, చర్చి లాంటి ప్రార్థనా మందిరాల్లో, ప్రతీ ఇంట్లో మొక్కలు నాటాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన మొక్కలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పట్టణంలో లక్షా 116 మొక్కలను నాటే కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీ జోగు రామన్న, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, పిసి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *