కత్తి మహేష్పై పరిపూర్ణానంద ప్రసంశలు

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఒంటికాలి మీద లేచే శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి మెత్తపడ్డారు. కత్తిపై ప్రశంసలు కురిపించారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి కారణమైన రామాయణాన్ని రచించిన వాల్మీకితో మహేష్‌ను పరిపూర్ణానంద పోల్చారు.

‘‘కత్తి మహేష్‌ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నా. మహేష్‌ బోయవాడిగా మాట్లాడినా… వాల్మీకిగా మారగల శక్తి ఉన్నవాడు’’ అంటూ పరిపూర్ణానందస్వామి కొనియాడారు. భారతీయ సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. హిందూ సంప్రదాయం, విలువను తెలిపే విధంగా విద్యా వ్యవస్థ ఉండాలని, రామనామ విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు.

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కత్తి మహేష్‌పై హైదరాబాద్‌లో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని హైదరాబాద్ నుంచి కత్తి మహేష్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. స్వయంగా తెలంగాణ డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి కత్తి మహేష్‌పై 6నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇక శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిపై కూడా హైదరాబాద్ పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. గతంలో ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. వాటికి ఆయన సమాధానం చెప్పలేదంటూ పరిపూర్ణానందపై కూడా 6 నెలల బహిష్కరణ విధించారు.
Image result for ??????????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *