ఎఫ్‌డీఐ నిబంధనలు కఠినం: చైనాకు చెక్‌

ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతరదేశాలు భారత కంపెనీల్లో వాటాలు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. భారత్‌తో సరిహద్దులు పంచుకొనే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఒకటి (ఆటోమేటిక్‌). ప్రభుత్వ అనుమతి తీసుకొని పెట్టడం రెండోది. ఇప్పటి వరకు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ రెండో విభాగంలో ఉండేవి. ప్రస్తుత నిబంధనలతో చైనాను రెండో విభాగంలో చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *